Bhamakalapam2: టాలీవుడ్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో ఉంది. సినిమాల నిర్మాణం.. విడుదల.. ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతున్నాయి. ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు. ఇది వరకు సినిమా అంటే థియేటర్లే ప్రేక్షకులకు. ఇప్పుడు సినిమా అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓటీటీ.. రెండు థియేటర్. ఇక్కడ ఓటీటీ ముందుగా ఎందుకు చెప్పమంటే.. థియేటర్ల కంటే ఎక్కువగా ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీకె ఓటు వేస్తున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చినా.. అక్కడ ఏమాత్రం బాగోలేదు అనే టాక్ వచ్చింది అంటే.. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా అటువైపు పోవడమే మానేశారు. టీవీలో వచ్చేస్తుంది కదా.. అని వెయిట్ చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఓటీటీలోనే నేరుగా తీసుకు వచ్చేస్తున్నారు మేకర్స్. అక్కడ వావ్ అనిపించుకున్న ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు పార్ట్ 1..2.. అంటూ వరుసగా రెండు మూడు భాగాలుగా సినిమాలు రావడం కూడా కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఒక సినిమా తీసి దానిని మొదట ఓటీటీలోకి నేరుగా వదలడం.. అక్కడ ట్రెండ్ బావుంటే.. దానికి కొనసాగింపు తీసి దానిని థియేటర్లలోకి తీసుకురావడం నయా ట్రెండ్. పొలిమేర సినిమా అందుకు ఉదాహరణ. అలాంటి సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయి.
Also Read: ఫ్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి: అంతేగా.. అంతేగా!
తాజాగా ప్రియమణి లీడ్ రోల్ లో చేసిన ఒక సినిమా కూడా పొలిమేర బాటలోనే నడుస్తోంది. ఆ సినిమా పేరు భామా కలాపం. గతేడాది ఇది ఓటీటీలో వచ్చి మంచి ఆదరణ పొందింది. అభిమన్యు దర్శకత్వంలో వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఓటీటీలో ఈ సినిమా బాగా వర్కౌట్ అయింది. దీనికి కొనసాగింపు ఉంటుంది అని అప్పుడు మేకర్స్ చెప్పారు కూడా. ఇప్పుడు అది రెడీ అయిపొయింది భామాకలాపం 2(Bhamakalapam2) విడుదలకు సిద్ధం అయింది. అయితే.. ఈసారి ముందుగా థియేటర్లలోకి దిగబోతోంది భామాకలాపం. ఆహా స్థూడియోస్ బేనర్ లో బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమా సీక్వెల్ కూడా అభిమన్యు దర్శకత్వంలోనే రూపుదిద్దుకుంది.
ఒక బంగారు గుడ్డు చుట్టూ తిరిగే కామెడీ థ్రిల్లర్ ఇది. యూట్యూబ్ లో వంటల షోలు నిర్వహించే అనుపమ (ప్రియమణి).. కోల్ కతా మ్యూజియం నుంచి మాయం అయిన బంగారు గుడ్డుకీ మధ్యలో జరిగే కథ ఇది. అసలు ఆ గుడ్డు అనుపమకి తెచ్చిన తిప్పలు ఏమిటనేది సినిమా. సినిమా అంతా నవ్వులు పూయిస్తూనే థ్రిల్ ఇస్తుంది. ట్విస్ట్ లు కూడా బావుంటాయి. మరి ఇప్పుడు అదేస్థాయిలో సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది త్వరలో థియేటర్లలో చూడాల్సిందే.
Watch this latest Video: