HBD Anil Ravi Pudi: ఫ్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి: అంతేగా.. అంతేగా!

అనిల్ రావిపూడి.. చిన్న సినిమాలతో రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. కామెడీ సినిమాలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి.. అగ్రదర్శకులలో ఒకరిగా నిలిచారు. బాలయ్య భగవంత్ కేసరితో లేటెస్ట్ గా మరో సూపర్ హిట్ అందుకున్న ఈ కుర్ర దర్శకుడి పుట్టిన రోజు నేడు.

New Update
HBD Anil Ravi Pudi: ఫ్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి: అంతేగా.. అంతేగా!

HBD Anil Ravi Pudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వరుస హిట్లతో ఊపు మీదున్న ఈ కుర్ర డైరెక్టర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీస్తు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాధించుకున్నారు ఈయన. ఆయన సినిమాల్లోని కామెడీ సన్నివేశాలకు, డైలాగ్స్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ సినిమాలో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, డైలాగ్స్ తన మార్క్ క్రియేట్ చేస్తుంటారు ఈ యువ డైరెక్టర్.

సినీ కెరియర్

అనిల్ రావి పూడి 1982 ప్రకాశం జిల్లా చిలకలూరి పాలెంలో జన్మించారు. తర్వాత తెలంగాణకు షిఫ్ట్ అయ్యిది అనిల్ ఫ్యామిలీ. మహబూబ్ నగర్ స్కూలింగ్ పూర్తి చేసుకున్న ఈ యువ డైరెక్టర్ హైదరాబాద్ లో బీటెక్ చేశారు. తర్వాత మంచి ఉద్యోగం చేసి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తన బాబాయ్ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ దగ్గర దర్శకత్వ విభాగంలో చేరారు. 2005 లో గౌతమ్ ఎస్.ఎస్.సీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత పటాస్, కందిరీగ, మసాలా, దరువు, ఆగడు సినిమాలకు రచయితగా పని చేశారు.

publive-image

2015 లో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమాతో తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత 2017 లో 'రాజా ది గ్రేట్' సినిమాలో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా చిత్రం అనిల్ రావి పూడి కెరియర్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. సుప్రీమ్, సరిలేరు నీకెవ్వరూ, F2, F3, చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. F2, F3 సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లు రీసౌండ్ వచ్చేలా నవ్వించాడు ఈ కుర్ర డైరెక్టర్.

publive-image

publive-image

కామెడీ డైరెక్టర్ గా మంచి హిట్లు అందుకున్న సమయంలో.. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించాడు. యాక్షన్ హీరో బాలకృష్ణ, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. 2023లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఈయన. చిన్న చిన్న సినిమాలతో రచయిత గా కెరియర్ స్టార్ట్ చేసి తనకున్న టాలెంట్ తో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి అగ్రదర్శకుల సరసన నిలిచారు.

publive-image

Also Read: HBD Naga Chaitanya: నేడు అక్కినేని వారసుడు నాగ చైతన్య బర్త్ డే.. 14 ఏళ్ల కెరియర్ లో ప్రతీ సినిమా స్పెషలే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు