Mumbai: కొంతకాలంగా గాయాల బారినపడి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన యంగ్ ప్లేయర్ పృథ్వీషా (Prithvi shaw) మళ్లీ పుంజుకుంటున్నాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కుర్రాడు భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత నమోదు చేశాడు. ఈ మేరకు రంజీల్లో ముంబై (Mumbai) తరఫున ఆడుతున్న పృథ్వీ గ్రూప్ B మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పై 185 బంతుల్లోనే 159 పరుగులతో (Century) విరవాహారం చేశాడు. దీంతో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు.
మొదటి రోజు లంచ్‌కు ముందే..
అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఈ ఘనతను ఎవరూ సాధించకపోవడం విశేషం. కాగా గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీ కొట్టేయగా సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఇది కూడా చదవండి : Ravi Shastri: అతడికి ఇష్టం లేకపోయినా ఆ ముద్ర వేశారు.. బుమ్రాకు కసి, ఆకలి తీరలేదు!
పుజారా డబుల్ సెంచరీ..
ఇక భారత జట్టులోకి వచ్చేందుకు సీనియర్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారాతోపాటు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన పుజారా(110; 230 బంతుల్లో 9×4) ఇప్పుడు తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. ఇక రాజస్థాన్‌తో గ్రూపు-ఎ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (101) కూడా సెంచరీతో రాణించాడు.