Chandrababu : ఖైదీ నెంబర్ 7691...రాజమండ్రి జైలుకు టీడీపీ అధినేత..!!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విజయవాడ ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్!
New Update

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయిన చంద్రబాబుకు ఏసీపీ కోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం అర్థరాత్రి పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను విజయవాడ నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గం ద్వారా తరలించారు. దాదాపు 5గంటలకు పైగా సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో ఉద్రికత్తలు తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అటు కోర్టుకు కూడా చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు అంగీకరించింది. భద్రతాకారణాల వల్ల రాజమండి సెంట్రల్ జైల్లో ప్రత్యేక గది కేటాయించాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. బాబుకు ఇంటి నుంచే ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక రూంను రెడీ చేశారు. ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా చంద్రబాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ కూడా రాజమండ్రి వెళ్లారు. అయితే భద్రతా కారణాల వల్ల అందరినీ జైలు బయటే నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్…ఆరుగురు కార్మికులు మృతి…!!

ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని, సోమవారుగ జరుగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవలసిందిగా కోరారు.

ఇది కూడా చదవండి: ‘బరువెక్కిన గుండెతో రాస్తున్న’.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..

#chandrababu-naidu #rajahmundry-central-jail #chandrababu-jail #skill-development-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe