Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్‌ఫాస్ట్‌ను పంపించారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విజయవాడ ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.