బాత్‌రూమ్ వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడి దారుణం.. ఫొటోలు తీసి

పాఠశాలలో బాత్‌రూమ్ కు వెళ్లిన విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒంగోలు జిల్లాలో కలకలం రేపింది. భయంతో ఇంటికి పరుగు తీసిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సుందరబాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డీఈవో అతన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

New Update
బాత్‌రూమ్ వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడి దారుణం.. ఫొటోలు తీసి

స్కూల్లో పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కామాంధులై కాటేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన వారే దారి తప్పుతూ బాలికలతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. తమ కూతురు వయసుకూడా లేని ఆడపిల్లలపై లైంగిక వాంఛ తీర్చుకోవడంకోసం దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవలే ఒడిశాలో ముగ్గురు ఉపాధ్యాయులు టాయిలెట్ వెళ్లిన బాలికను బలవంతంగా అత్యాచారం చేసిన సంఘటన మరవకముందే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాత్ రూమ్ వెళ్లిన విద్యార్థినిపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

ఈ మేరకు ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద కొత్తపల్లి పంచాయతీ పరిధి అంజయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు క్లౌపేటకు చెందిన సుందరబాబు అంజయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఓ బాలిక బాత్‌రూంకు వెళ్లగా ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. భయపడిన బాలిక బయటకు పరుగు తీసి నేరుగా తల్లిదండ్రుల వద్దకెళ్లి విషయం తెలియజేసింది. విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్దకు చేరి సుందరబాబుకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకోగానే స్థానికులకు సర్ది చెప్పి నిందితుడిని స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు బాలికలతోనూ ఆయన ఇలానే ప్రవర్తించి, ఫొటోలు తీసినట్లు పిల్లలు చెబుతున్నారు. ఈ విషయం తీవ్ర కలకలం సృష్టించడంతో డీఈవో సదరు ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నిందితుడు మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉందని, అంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు.

Also read :ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ-చలానా మోసగాడు.. ఎన్నికోట్లు దోచేశాడంటే

ఈ భయంకరమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలకు పాఠశాలలే రక్షణగా ఉంటాయనుకుంటే వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందని, నేరస్తులను కఠినంగా శిక్షించి మరెవరూ ఇలాంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు