Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే!

అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.

New Update
Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే!

PM MODI Ayodhya Tour: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో (Ayodhya Ram Mandhir) రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి (Bala Rama) విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు.

ఇది కూడా చదవండి: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు జగన్.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

రేపు ప్రధాని మోడీ షెడ్యూల్ …

* ప్రధాని మోడీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

* అక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు.

* ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.

* రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోడీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు.

* ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది.

* కాగా, ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ.. కేవలం కొబ్బరి నీళ్లనే తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
తాజా కథనాలు