Operation Valentine : ఆపరేషన్ వాలంటైన్ లో...ప్రధాని మోదీ పాత్రే హైలైట్ ?

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ మూవీలో ప్రధాని మోదీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Operation Valentine : ఆపరేషన్ వాలంటైన్ లో...ప్రధాని మోదీ పాత్రే హైలైట్ ?
New Update

Operation Valentine : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తెలుగు, హిందీ ద్విభాషా సినిమా ఆపరేషన్ వాలెంటైన్.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటిసినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో ఈ మూవీని తెరకెక్కించారు. మార్చి 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందో దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంంది. ట్రైలర్ లో ఉన్న క్వాలిటీ విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

దీనితోపాటు సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.అయితే ఈ మూవీ స్టోరీ గురించి కొన్నికీలక అంశాల గురించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ప్రభుత్వం ఆర్మీకి ఎలాంటి ఆదేశాలు ఇస్తోంది...డిఫెన్స్ మినిస్ట్రీ, ప్రధాని ఇలా అన్ని అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి.

అయితే ఈ మూవీలో ప్రధాని మోదీ పాత్ర హైలైట్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో ప్రధాని మోదీని పోలిన పాత్రను చూపించారు. అది బాగా కలిసి వచ్చింది. పాకిస్తాన్ దాడులపై వార్ రూమ్ లో ప్రధాని సమావేశాలు నిర్వహించడం, సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఈ మూవీలో మోదీ పాత్ర ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగానే మోదీ పాత్ర ఈ సినిమాకు హైప్ ను ఇవ్వాందా ? చూడాల్సిందే.

ఇది కూడా చదవండి :  కొడుకు పెళ్లిలో డ్యాన్స్‎ చేస్తూ సందడి చేసిన వైఎస్ షర్మిల..వీడియో ఇదిగో..!

#narendra-modi #operation-valentine-movie #operation-valentine-pre-release-event #shakti-pratap-singh #varun-tej-air-force-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe