PM Modi Key Call On Handlooms : చేనేత రంగాల్లో సాధిస్తున్న పురోగతిలో ప్రధానంగా మహిళలకే ప్రయోజనం దక్కుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశంలో చేనేత, ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. దీంతో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయంటూ ఆదివారం 112వ 'మన్ కీ బాత్' (Mann Ki Baat) ఎపిసోడ్‌లో కీలక పిలుపునిచ్చారు.
గ్రామోద్యోగ్ వ్యాపారం రూ.1.5 లక్షల కోట్లు దాటింది..
ఈ మేరకు మోదీ మాట్లాడుతూ.. దేశంలో ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లు దాటిందని చెప్పారు. ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం (National Handlooms Day) సందర్భంగా ప్రజలంతా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయండి. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో 250 మందికిపైగా మహిళలు చేనేత ఉత్పత్తులు తయారు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఉన్నతి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో చేరాక వారి జీవితాలు మారాయి. అధునాతన టెక్నాలజీతో చేనేత పనులు చేయడంపై శిక్షణ పొందాక వారు బెడ్ కవర్స్, సారీలు, దుపట్టాలు తయారు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: PM Modi: అదే ఎజెండాతో ముందుకెళ్లండి.. బీజేపీ ‘సీఎం’లకు మోదీ కీలక సూచనలు!
ఒడిశాకు చెందిన సంబల్ పురి సారీ, కశ్మీర్‌కు చెందిన కానీ షాల్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన మహేశ్వరీ సారీలు హ్యాండ్లూమ్ ప్రపంచంలో ఎంతో పేరును గడించాయన్నారు. ప్రజా కళలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ప్రాజెక్ట్ 'పరీ' గురించి కూడా ఆయన ప్రస్తావించారు.