PM Modi : అదే ఎజెండాతో ముందుకెళ్లండి.. బీజేపీ 'సీఎం'లకు మోదీ కీలక సూచనలు! ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తేనే అభివృద్ధి చెందిన భారతావని సాకారం అవుతుందన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు అదే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు By srinivas 28 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PM Modi: దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్లాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధిచెందిన భారతావని సాకారం అవుతుందన్నారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండలి సమావేశం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎక్కడికక్కడ అమలు చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియాను సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. Also Read : ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు #bjp-cms #pm-modi #vikasitha-bharath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి