ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఇదే..!!

గత లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‎లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ స్ట్రైక్ రేట్ వందశాతం నమోదు అయ్యింది.

ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఇదే..!!
New Update

మరికొద్ది నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. రాష్ట్ర పరిస్థితులు తగ్గట్లుగా ఎక్కడిక్కడే ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లో రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో అగ్రనేత ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఆ పార్టీకి ఎంత మైలేజీ తెచ్చిందో అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మంగళవారం రాజస్థాన్‌లోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని గుజరాత్ గర్వి భవన్‌లో రాజస్థాన్ ఎంపీలతో ప్రధాని ఈ సమావేశం జరిగింది. గత లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. 25 స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ బీజేపీ స్ట్రైక్ రేట్ 100 శాతం ఉంది. గుజరాత్ తర్వాత, రాజస్థాన్‌లో బిజెపి బలంగా ఉంది. దీంతో రానున్న ఎన్నికల్లో అదే జోరు కొనసాగించేలా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మోదీ.

రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంపీలు, ఇతర నాయకుల నుండి ప్రధాని మోదీ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. అదే సమయంలో ఈ సమావేశంలో, ప్రధాని మోదీ కూడా రాష్ట్ర నాయకులకు అతివిశ్వాసంతో ఉండకూడదని సూచించారు.ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించారు. అంతేకాదు ఈ సమావేశంలో, రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే ప్రదర్శనలు, ఇతర అంశాలపై కూడా ప్రధాని మోదీ చర్చించారు. ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ప్రజల్లోకి తీసుకెళ్లాలని...ఎంపీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ హామీ పేరుతో ప్రజల్లోకి వెళ్లి విస్త్రుత ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2024 ఎన్నికల సమరానికి అవసరమైన మంత్రాలను ఎంపీలకు అందించారు. తన దార్శనికతను ముందు ఉంచుకోవడంతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. బీజేపీకి కాంగ్రెస్ లాగా అహంకారం లేదని..రాజస్థాన్ లో ఎగిరేది కాషాయం జెండానే అన్నారు.

రాష్ట్రంలో మూడురథయాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎంపీలు మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు మూడు దిక్కులా ఈ రథాలను పరుగులు పెట్టించనున్నారు. రాష్ట్రమంతా చుట్టేసి..మూడు రథాలు రాష్ట్ర రాజధాని జైపూర్ కు చేరుకునేలా ప్లాన్ చేసినట్లు మోదీకి వివరించారు. రథయాత్ర ముగింపును ఒక గ్రాండ్ ఈవెంట్ లా నిర్వహించాలని...ఈ బహిరంగసభకు మోదీ హాజరయ్యేలా కసరత్తు చేస్తున్నారు నేతలు.

రాజస్థాన్ సహా అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు కీలకంగా మారింది. ఈ మధ్యే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభావం కమలనాథులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అలాంటి ఫలితాలు మళ్లీ పురావ్రుతం కాకుండా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది మోదీ సర్కార్.

#lok-sabha-elections-2024 #rajasthan #nda #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe