PM Modi : వచ్చే నెలలో రష్యాకు మోదీ?

ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.

PM Modi : వచ్చే నెలలో రష్యాకు మోదీ?
New Update

Modi Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జూలైలో రష్యా (Russia) కు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. కాగా, జూలై 8వ తేదీన మోదీ రష్యాలో ఒక రోజు పర్యటన చేపట్టేందుకు అవకాశాలున్నాయని, దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని దౌత్య వర్గాలు అంటున్నాయి. పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin), ప్రధాని మోదీ మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు. అప్పట్లో వాదివోస్టోక్లో జరిగిన ఎకనామిక్ కాంక్లేవ్లో పాల్గొన్నారు.

Also Read : 29న కొండగట్టుకు, జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్

#russia #putin #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe