Telangana: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ?

ప్రధాని మోదీ ఈరోజు సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ వేదికపై నుంచి ప్రధాని.. ఎస్సీ వర్గీకరణపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Savings Account: అదిరే స్కీమ్ తీసుకొచ్చిన మోదీ సర్కార్...ఈ అకౌంట్ ఉంటే చాలు..రూ. 2.30లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం మరో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే అది ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత అంశానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శనివారం ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. శనివారం సికింద్రాబాద్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా ఆయన హాజరుకానున్నారు. అయితే ఇక్కడే ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఈ అంశంపై రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని ప్రధాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీల సభకు మోదీ వచ్చిన సందర్భంగా ఆయనతో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారు ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. ఇందులో షెడ్యూలు కులాల వర్గీకరణపై మోదీ కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ‘విశ్వరూప సభ’కు మోదీ రానున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయన ప్రకటన చేస్తారని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం.. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశం హామీ ఇవ్వడం అనే ఈ రెండు విషయాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని.. ఈ నినాదాలతో రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీల సమస్యలను పరిష్కరించేలా ప్రకటనలు చేస్తే అది ప్రత్యర్థి పార్టీలను అయోమయంలో పడేస్తుందని, వారికి విమర్శలు చేసే అవకాశం ఉండదని ముఖ్యనేతలు భావిస్తున్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ-చట్టబద్ధత అంశంపై బీజేపీ పార్టీలో అంతర్గతంగా గత ఐదు నెలలుగా కసరత్తు జరిగిందని, ఆ తర్వాతే ప్రధాని మోదీ కీలక ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

గతంలో ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు అమల్లోకి తెచ్చినా వాటిని రద్దు చేసేందుకు 2004 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడంతో మళ్లీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. 2004లో వైఎస్సార్‌ ప్రభుత్వం కూడా రాజ్యాంగ సవరణ కోసం ఒక తీర్మానం చేసింది. అందుకు తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మెహ్రా కమిషన్‌ను నియమించింది. అయితే ఈ కమిషన్‌ 2008 మే నెలలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341లో సవరణలు చేయడంతో రాష్ట్ర అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానాలను పార్లమెంటులో ఆమోదించవచ్చని పేర్కొంటూ ఒక నివేదికను ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి వర్గీకరణ అంశం పెండింగ్‌లోనే పడింది. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపారు. మళ్లీ 2018లో డిమాండ్‌ చేశారు. ఎస్సీ కోటాను 15శాతానికి మించి పెంచాల్సిన అవసరం ఉందని.. 2021లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్‌ చేశారు.

అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోదీ ఈ ప్రకటన చేస్తే రాష్ట్ర ఎన్నికల్లో ఇది ప్రభావం చూపుతుందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎస్సీల ఓట్లు 18శాతం ఉండగా.. అందులో 14శాతం మాదిగలే. ఇందులో ఒకటి, రెండుశాతం పోయినా, మెజారిటీ మాదిగలు తమకే అండగా ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Also Read: ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

Advertisment
తాజా కథనాలు