Hyderabad: మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో.. పోటెత్తిన జనం..! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి వరకూ రోడ్ షోలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ప్రధాని అభివాదం చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో బస చేసి శనివారం నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో పాల్గొంటారు. By srinivas 15 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి PM Modi Road Show in Hyderabad : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. గత 10 రోజుల వ్యవధిలో మోడీ తెలంగాణలో పర్యటించడం ఇదో రెండోసారి కావడం గమనార్హం. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి (Malkajigiri) వరకూ రోడ్ షో చేపట్టారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, భువనగిరి అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ప్రచార ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోడీ ప్రచార రథంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో (Kishan Reddy) పాటు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఉన్నారు. ఈ రోడ్ షోకు భారీగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. జై మోడీ.. జై మోడీ అంటూ నినాదాలు చేశారు. మల్కాజ్‌గిరి కాషాయమయం.. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మోడీ రోడ్ షో మార్గాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాని మోడీ షో కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra) నేపథ్యంలో మల్కాజిగిరి, మీర్జాలగూడ వీధులు కాషాయమయం అయ్యాయి. బీజేపీ జెండాలు, కండువాలతో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కాగా వారందరికీ అభివాదం చేస్తూ మోడీ ముందుకు కదిలారు. ప్రధాని రోడ్ షోలో తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తుండగా యాత్ర ముందుకు కదిలింది. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు మోడీ.. మోడీ.. మోడీ.. అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? మార్మోగిన రహాదారులు.. దీంతో మీర్జాలగూడ, మల్కాజిగిరి వీధులు మోడీ నినాదాలతో మార్మోగాయి.ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రతను ఏర్పాటుచేశారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మల్కాజిగిరిలో రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోడీ రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరి నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ సభను ఏర్పాటుచేస్తున్నారు. #pm-modi #malkajgiri #pm-modi-telangana-tour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి