Pregnant Women Precautions : పని చేసే మహిళలకు(Working Women's) గర్భధారణ సమయం(Pregnancy Period) చాలా ముఖ్యమైనది. గర్భిణులు పనితో పాటు ఆరోగ్యం(Health Care) పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్న పొరపాటు, అజాగ్రత్తగా ఉన్నా మీ పిండం ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రోజును ముందుగానే ఇలా ప్రారంభించాలి:
- గర్భధారణ సమయంలో మీ సాధారణ సమయం కంటే కొంచెం ముందుగా నిద్రలేవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గర్భిణులు మునుపటిలా హడావిడిగా పనులు చేయడం అంత సులువు కాదు. నిద్రలేచిన(Wakeup) తర్వాత కాసేపు నడవండి. బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోనే చిన్నచిన్న వ్యాయామాలు చేయండి.
సమతుల్య ఆహారం:
- గర్భధారణ సమయంలో శరీరానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం ఎంతో అవసరం. కాబట్టి అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమయంలో ఆహారంలో పండ్లు, పచ్చి కూరగాయలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి.
ఎక్కువసేపు ఆకలితో ఉండోద్దు:
- గర్భిణులు ఆఫీసులో పని బిజీలో పడి భోజనాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. ఇది మీ ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
లిక్విడ్ డైట్ మంచిది:
- ఆహారంతో పాటు అధిక మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే లిక్విడ్ డైట్(Liquid Diet) శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగడం మంచిది. అంతేకాకుండా పాలు, రసం, సూప్, మజ్జిగ, లస్సీ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. టీ, కాఫీలు ఎక్కువగా తాగొద్దని వీలైతే గ్రీన్ టీ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
విశ్రాంతి తీసువాలి:
- కార్యాలయం(Office) లో పని ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవద్దు. టైమ్ ఉన్నప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలి.
మానసిక ఒత్తిడికి గురికావద్దు:
- గర్భధారణ సమయంలో ఆఫీసు పని లేదా ఎలాంటి మానసిక ఒత్తిడిని తీసుకోవద్దు. గర్భధారణ సమయంలో తల్లి సంతోషంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించకూడదు.
ఇది కూడా చదవండి: మన శరీరంలో కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.