Pregnancy HealthTips: గర్భధారణ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో, మహిళలు ఆహారం నుంచి రొటీన్ వరకు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ 9 నెలల దశ చాలా సున్నితమైనది. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా, ఈ కాలంలో ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తాయి. చాలా సార్లు వివిధ రకాలైన వస్తువులను తినాలని కోరికగా అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో అనారోగ్యకరమైన వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ - కూల్ డ్రింక్స్ తాగడం తల్లి - బిడ్డ ఇద్దరికీ హానికరం.
ఒత్తిడి లేని గర్భం - ఆరోగ్యకరమైన డెలివరీ కోసం, సమతుల్య -ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలాగే అనారోగ్యకరమైన ఆహారాన్ని నివారించడం చాలా ముఖ్యం. మీరు గర్భధారణ దశలో శీతల పానీయాలు తాగితే, అది మీ ఆరోగ్యానికి అలాగే పిండానికి హాని కలిగిస్తుంది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
వైద్యులు ఏమి చెబుతారు
శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని, అలాగే శాచరిన్ (శీతల పానీయాలు - ప్యాక్ చేసిన జ్యూస్‌లలో తీపి కోసం ఉపయోగించే ఒక రకమైన పదార్ధం) కూడా యాడ్ చేస్తారనీ.. ఇది మహిళలకు హానికరమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇది తల్లీ, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం అని అంటున్నారు.
ఎన్ని శీతల పానీయాలు తాగవచ్చు?
ప్రెగ్నెన్సీ సమయంలో శీతల పానీయాలు తాగడం మానుకోవాలని, కానీ విపరీతమైన కోరిక ఉంటే, రెండు మూడు నెలలకు ఒకసారి లేదా రెండు సార్లు శీతల పానీయాలు తాగవచ్చని, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో తాగవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటే హాని కలుగుతుంది.
Also Read: గర్భధారణ సమయంలో తినాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలివే!
దుష్ప్రభావాల ప్రమాదం
శీతల పానీయాలలో రుచి - రంగు కోసం చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇది సాధారణ ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. అదే సమయంలో, గర్భధారణ సమయంలో ఇది మరింత హానికరం. ఇది అలెర్జీలు, బరువు పెరగడం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు మొదలైన అనేక ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన గర్భం కోసం చల్లని పానీయాలను నివారించండి.
త్రాగడానికి ముందు పదార్థాలను చెక్ చేయండి
గర్భధారణ సమయంలో శీతల పానీయం లేదా ఏదైనా ప్యాక్ చేసిన శీతల పానీయాన్ని తీసుకుంటే, ప్యాకెట్‌పై వ్రాసిన పదార్థాలను జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే అందులో ఉన్న కొన్ని పదార్ధాలు తల్లి - బిడ్డ ఇద్దరికీ చాలా కఠినంగా ఉంటాయి. గర్భిణీలు చల్లని పానీయాల కోరికలను తీర్చడానికి, వారు కొన్ని ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్ వంటి వాటిని వాటికి ప్రత్యామ్నాయాలుగా తీసుకోవచ్చు.
గమనిక: ఈ ఆర్టికల్ సాధారణ అవగాహన కోసం ఇచ్చినది. వివిధ సందర్భాల్లో వైద్య నిపుణులు చెప్పిన.. హెల్త్ జర్నల్స్ లో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా ఇది ఇవ్వడం జరిగింది. ఎ విధమైన మందులు వాడమని గానీ, ఇదే తీసుకోవాలని కానీ ఈ ఆర్టికల్ కచ్చితంగా చెప్పడం లేదు. ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే వైద్యులను సంప్రదించాలని సూచన.
Watch this interesting Video: