Jai Hanuman: హనుమాన్, రాముడిగా ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరో చెప్పేసిన ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వర్మ "జై హనుమాన్" లో హనుమాన్ పాత్ర ఎవరు చేయబోతున్నారనే అంశం పై అందరు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు కూడా చేసే ఛాన్స్ ఉందంటూ ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

Jai Hanuman: హనుమాన్, రాముడిగా ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరో చెప్పేసిన ప్రశాంత్ వర్మ
New Update

Jai Hanuman:  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో మొదటి సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ మూవీ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. సూపర్ సక్సెస్ తో జోరు మీద ఉన్న ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వేగవంతం చేశారు. ఇటీవలే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హనుమాన్ పాత్ర ఎవరు చేయబోతున్నారు అనే అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే హనుమాన్ పాత్రలో కనిపించేది వీళ్ళే అంటూ కొంత మంది స్టార్ హీరోల పేర్లు బయటకు వచ్చాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ ఈ విషయం పై ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి

హనుమంతుడిగా మెగాస్టార్, రాముడిగా మహేష్ బాబు

ఈ ఇంటర్వ్యూ లో హనుమాన్, రాముడు పాత్రలు ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ వర్మ. జై "హనుమాన్ చాలా పెద్ద స్కెల్ చిత్రం. స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమాన్ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు వారి ఇమేజ్ సరిపోవాలి. ఆ పాత్రను చూడగానే భక్తితో నమస్కారం చేయాలనే భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి కూడా ఉండొచ్చు.

publive-image

ఇక రాముడిగా నా మనసులో ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సోషల్ మీడియాలో మహేష్ బాబును రాముడిగా క్రియేట్ చేసిన ఫోటోలు చూశా.. మా ఆఫీస్ లో రాముడు పాత్రను ఆయన మొహంతో క్రియేట్ చేసి చూసుకున్నాము". ఒకవేళ అన్నీ సెట్ అయితే హనుమంతుడిగా చిరంజీవి, రాముడుగా మహేష్ బాబు చేసే ఛాన్స్ కూడా ఉందని ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

Also Read: Kumari Aunty: కుమారి ఆంటీకి పోలీసుల షాక్.. ఫుడ్ బిజినెస్ బంద్

#jai-hanuman-movie #prashanth-varma
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe