Prashanth Neel: 'సలార్' నటుడి పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ప్రభాస్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ 'సలార్'. ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.."ఆయన లేకపోతే 'సలార్' లేదు" అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించారు.

Prashanth Neel: 'సలార్' నటుడి పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
New Update

Prashanth Neel: 'సలార్' రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారిన కథనంతో రాబోతున్న ఈ చిత్రం పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'సలార్' పేరే వినిపిస్తుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా 'సలార్'. సినిమా నుంచి తాజాగా విడుదలైన యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది. ఈ నెల డిసెంబర్ 22 న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం బృదం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న చిత్ర బృదం సినిమా గురించి అభిమానులతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. సలార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించారు.

publive-image

"సలార్ సినిమాలో మన్నార్ పాత్రకు కరెక్ట్ గా సరిపోయే నటుడు కోసం చాలా ట్రై చేశాము. కొంత మంది బాలీవుడ్ నటులను తీసుకోమని సలహా కూడా ఇచ్చారు. కానీ నేను మాత్రం ఈ పాత్రకు పృథ్వీరాజ్ నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ముందుగా ఆయనను సెకండ్ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నాను.. కానీ కథ నచ్చిన నచ్చడంతో వెంటనే అంగీకరించారు. ప్రేమ, ద్వేషం రెండింటినీ ఆయన మాత్రమే నటించగలరు అని తెలిపారు. పృథ్వీరాజ్ ఒక విషయాన్నీ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడి కోణంలో కూడా ఆలోచిస్తారని తెలిపారు. 'సలార్' సినిమాకు సంబంధించి ఎన్నో ఆలోచనలను షేర్ చేసుకున్నారు. ఆయన లేకపోతే 'సలార్' లేదు" అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ పై  ప్రశంసలు కురిపించారు.

Also Read: Shreyas Talpade: ‘పుష్ప’ లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..!

#prabhas-salaar-movie #prashanth-neel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe