Prasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా? By Anil Kumar 30 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Prasanth Varma - Ranveer Singh Movie Postponed : 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి. రీసెంట్ గా ఈ సినిమాకి టైటిల్ ని కూడా లాక్ చేసినట్లు తెలిసింది. ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి ‘బ్రహ్మ రాక్షస’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారని, పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు ఇటీవలే న్యూస్ వచ్చింది. ఇక ఇప్పుడు అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫషియల్ గా అనౌన్స్ చేసింది. Also Read : సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన ‘హరోం హర’ ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ! 'బ్రహ్మ రాక్షస' వాయిదా ప్రశాంత్ వర్మ - రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు మూవీ యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ప్రస్తుతానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందని, ఫ్యూచర్ లో వీళ్ళిద్దరూ కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. కాగా ఈ ప్రెస్ నాట్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.." రణ్‌వీర్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరకడం చాలా కష్టం. ఎంతో టాలెంటెడ్. భవిష్యత్తులో ఆయనతో కలిసి వర్క్ చేస్తాను" అన్నారు. అటు రణ్‌వీర్ సైతం స్పందిస్తూ.."'ప్రశాంత్ ఆలోచనలు మరోస్థాయిలో ఉంటాయి. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేయాలని చర్చించాం. ఫ్యూచర్‌లో తప్పకుండా చేస్తాం" అని అన్నారు. మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడికల్ డ్రామాగా రూ.200కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ,మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఇంతలోనే ఈ ప్రాజెక్ట్ వాయిదా పడటం గమనార్హం. అయితే సినిమా ఎందుకు వాయిదా పడిందనే దానిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే వాయిదా పడిందని టాక్ వినిపిస్తుంది. An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!! In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/OG2gqkwJMO — Ramesh Bala (@rameshlaus) May 30, 2024 #prasanth-varma #ranveer-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి