Praneeth: హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. బ్లాక్ మెయిల్ చేసి బాగా వాడేసిన పోలీస్ బాస్!

ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి రాజకీయ నాయకులకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. వారిని బ్లాక్ మెయిల్ చేసి రకరకాలుగా వాడుకున్నారనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

New Update
Praneeth: హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. బ్లాక్ మెయిల్ చేసి బాగా వాడేసిన పోలీస్ బాస్!

Phone Tapping Case: గత ప్రభుత్వ హాయంలో ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ చేసారనే ప్రచారం జరుగుతుండగా తాజాగా పలువురు హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ నాయకులకు పంపినట్టు తెలుస్తొంది.

హీరోయిన్లపై బ్లాక్ మెయిలింగ్..
హీరోయిన్ల ఫోన్ కాల్స్ వినడం, రికార్డ్ చేయటం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రికార్డింగ్ కాల్స్‌తో పాటు చాట్ హిస్టరీని కూడా చోరీ చేసి, ఆ డాటాను పెన్‌డ్రైవ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా కొందరు రాజకీయ పెద్దలకు పంపినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డాటా వారికి ఉద్దేశ్యపూర్వకంగా స్వలాభం కోసం వాడుకున్నారా? లేక హీరోయిన్లపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో వార్తలొస్తున్నాయి. అయితే ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఎవరి హస్తం ఉందనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తొంది. కస్టడీలో భాగంగా ఐదవ రోజు ప్రణీత్‌ను పోలీసులు విచారించగా... పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నలో ప్రణీత్ రావు నడిచినట్లు విచారణలో తేలింది. 50 మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ప్రణీతరావు.. మూడు షిఫ్టుల్లోనూ అధికారులను ఉపయోగించి టాపింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో ప్రణీత్ రావు ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన అధికారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైకోర్టులో చుక్కెదురు..
ఎస్‌ఐబీ చీఫ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రణీత్ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు విచారణలో బయటపడింది. నిషేధిత మావోయిస్టు, టెర్రరిస్టుల ఫోన్‌పై నిఘా పెట్టాల్సిన వింగ్ ప్రైయివేట్ వ్యక్తుల ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఎస్‌ఐబీలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడికి సహకరించిన అధికారులను కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఇన్స్‌పెక్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. నిన్న ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు ప్రణీత్‌ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు