KCR: మై రాక్ స్టార్.. కేసీఆర్ నడుస్తున్న వీడియోపై ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ ట్వీట్

కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ చికిత్స అనంతరం డాక్టర్ల సాయంతో వాకర్ తో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ క్రమంగా కోలుకుంటుండడంతో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ గా స్పందించారు.

New Update
KCR: మై రాక్ స్టార్.. కేసీఆర్ నడుస్తున్న వీడియోపై ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ ట్వీట్

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ చికిత్స అనంతరం డాక్టర్ల సాయంతో వాకర్ తో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ క్రమంగా కోలుకుంటుండడంతో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది కూడా చదవండి: బీజేపీకి ఓటు వేయడంతో ముస్లిం మహిళను కొట్టిన బంధువు.. చివరికి

మాజీ ముఖ్యమంత్రి వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను ప్రకాశ్ రాజ్ షేర్ చేస్తూ కేసీఆర్ ను ఉద్దేశించి ‘మై రాక్ స్టార్’ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్ రూంలో కాలు జారి పడడంతో తుంటి ఎముకకు గాయమైన సంగతి తెలిసిందే. యశోద హాస్పిటల్ లో చేరిన ఆయనకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ కు చేసిన హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైంది.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్

ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవ్వొచ్చని వైద్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రకాశ్ రాజ్ కేసీఆర్ నడుస్తున్న వీడియోతో ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు