AP Elections: నిరుద్యోగులకు నెలకు రూ.6,000.. సంచలనంగా కేఏ పాల్ మేనిఫెస్టో

AP: విశాఖ ఎంపీ రేసులో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈరోజు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ.6వేల నిరుద్యోగ భృతి, ఉచిత విద్య వైద్యం, మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం, 100 రోజుల్లో ఉద్యోగాలు వంటి హామీలను కేఏ పాల్ ప్రకటించారు.

KA Paul: ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!
New Update

Praja Shanthi Party Election Manifesto 2024: ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామని కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ ఏపీలో అధికారంలో రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇతర పార్టీలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు వ్యతిరేకంగా మేనిఫెస్టోను విడుదల చేశాయని.. ఆ పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావని అన్నారు.

ALSO READ: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్

తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో ఎన్నో రోజుల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రాక సతమతమవుతున్న నిరుద్యోగులకు రూ.6వేల నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. 100 రోజుల్లోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఏపీలో నిరుద్యోగులే లేకుండా చేస్తామన్నారు. తమ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్ర ప్రజలు బాగుపడడం అని.. అందుకోసమే తాము ప్రకటించిన మేనిఫెస్టోలో ఉచిత విద్య (Free Education), ఉచిత వైద్యం అనే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో అందరికి ఉచిత విద్య  వైద్యం అందితే పేదరికం సగం నిర్మూలించవచ్చని అన్నారు. అలాగే మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు విడతల వారీగా రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తామని అన్నారు. 

కాగా ఏపీలో రానున్న ఎన్నికల్లో (AP Elections 2024) విశాఖ నుంచి ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన ప్రచార శైలితో విశాఖ ప్రజలను ఆకట్టుకుంటున్నారు పాల్. విశాఖ ప్రజలు బొత్స సత్యనారాయణ భార్యను, టీడీపీ ఎంపీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించేందుకు సిద్ధంగా లేరని అన్నారు. విశాఖ ప్రజలు నేను గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరి కేఏ పాల్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

#ap-elections-2024 #ka-paul #praja-shanthi-party #ka-paul-manifesto
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe