PMVY: పీఎం విశ్వకర్మ యోజన పథకంలో ఎవరు చేరవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?

PM విశ్వకర్మ యోజన పథకానికి పడవలు నిర్మించే వ్యక్తులు, కమ్మరి, రాళ్ళు పగలగొట్టే వారు, తాళాలు వేసేవారు, బుట్టలు/చాపలు/చీపురు తయారు చేసేవారు, చెప్పులు కుట్టేవారు, బొమ్మలు, దండలు తయారీదారులు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
PMVY: పీఎం విశ్వకర్మ యోజన పథకంలో ఎవరు చేరవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?

Pradhan Mantri Vishwakarma Yojana: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ వాటి స్థాయిలలో అనేక ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అనేక పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. అలాంటి పథకాల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఒకటి. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకంలో 18 సాంప్రదాయ వ్యాపారాలు చేర్చి ఉన్నాయి. ఈ పథకం కింద ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది కేంద్రం. మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే అర్హత, దరఖాస్తు, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

పథకంలో ఎవరు చేరవచ్చు?

--> పడవలు నిర్మించే వ్యక్తులు, కమ్మరి

--> రాళ్ళు పగలగొట్టే వారు

--> తాళాలు వేసేవారు

--> బుట్టలు/చాపలు/చీపురు తయారు చేసే వ్యక్తులు

--> చెప్పులు కుట్టేవారు/షూ తయారీదారులు చేతివృత్తులవారు

--> బొమ్మల తయారీదారులు

--> దండలు తయారు చేసేవారు

-->చాకలివారు

--> గన్‌స్మిత్‌లు లేదా శిల్పులుగా ఉండే వ్యక్తులు

--> క్షురకులు

--> స్వర్ణకారులు

ఎలా దరఖాస్తు చేయాలి:-

--> మీకు అర్హత ఉంటే, దరఖాస్తు చేయడానికి సమీపంలోని జన్ సేవా కేంద్రాన్ని సందర్శించండి.

--> అక్కడికి వెళ్లి మీ పత్రాలను ధృవీకరించండి. మీ అర్హత కూడా చెక్ చేస్తారు.

--> చెకింగ్‌లో ప్రతిదీ సరైనదని తేలిన తర్వాత మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.

ప్రయోజనాలేంటి?

--> మీరు పథకంలో చేరినట్లయితే మీకు రోజుకు రూ.500 స్టైఫండ్ ఇస్తారు.

--> టూల్‌కిట్‌ను కొనుగోలు చేయడానికి మీకు రూ. 15,000 ఇస్తారు.

--> రూ.లక్ష రుణం, ఆపై రూ.2 లక్షల అదనపు రుణం.. గ్యారెంటీ లేకుండా, చౌక వడ్డీ రేటుకు ఇస్తారు.

Website: https://pmvishwakarma.gov.in/

Also Read: ఖర్చు లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో గేమ్ ఛేంజర్!

Advertisment
తాజా కథనాలు