నేటికాలంలో ఇన్సురెన్స్ అనేది చాలా ముఖ్యం. మధ్యతరగతి, ధనిక ప్రజలే కాదు..నిరుపేదలు కూడా ఈ ఇన్సురెన్స్ సదుపాయం ఉండాలన్న ఉద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ స్కీం పేరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana )ఈ స్కీంలో నెలకు కేవలం రూ. 32 కడితే రూ. 2లక్షల వరకు బీమా రక్షణ (Insurance coverage)ను పొందవచ్చు. ఈ స్కీం కేంద్రం 2015లో ప్రారంభించింది. మీరు కూడా అతి తక్కువ ప్రీమియం ఈ ఇన్సూరెన్స్ స్కీం కవరేజ్ పొందాలనుకుంటే ముందు ఈ స్కీం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి.
ఈ స్కీం గురించి పూర్తి వివరాలు:
కులం, మతం, ప్రాంతం వర్గంతో ఎలాంటి సంబంధం లేకుండా 18 నుంచి 70ఏళ్ల వయస్సున్న ఎవరైనా సరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరవచ్చు. ఇప్పుడు చాలా మంది చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలంటూ నిత్యం ఎక్కడికో చోటకు ప్రయాణిస్తుంటారు. కుటుంబాలకు వీళ్లే పెద్దదిక్కు. అలాంటి వ్యక్తులు ఈ స్కీంలో చేరితే..అతి తక్కువ ప్రీమియంతో కుటుంబం మొత్తానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
పాలసీ తీసుకున్న తర్వాత ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో పాలసీదారు మరణించినట్లియితే..నామినీకి రూ. 2లక్షల వరకు బీమా డబ్బు లభిస్తుంది. అంటే తన మరణం తర్వాత కూడా తన కుటుంబానికి ఆర్థిక రక్షణను పాలసీదారులు అందిస్తారు. మరోవైపు ప్రమాదంలో అవయవ వైకల్యం ఏర్పడినట్లయితే రూ. 1లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరి ఈ ప్రీమియం ఎలా చెల్లించాలి?
ఈ స్కీంలో చేరాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ఉండాలి (Post office account). ప్రీమియం కోసం ప్రతి ఏడాది రూ. 436చెల్లిస్తే సరిపోతుంది. 2022కు ముందు ఈ మొత్తం రూ. 330 గా ఉంటుంది. ఆ తర్వాత రూ. 426 కు పెంచింది. ఇప్పుడు రూ. 436 అయ్యింది. ప్రీమియం కడితే బీమా కవరేజ్ ఏటా జూన్ 1 నుంచి తర్వాత ఏడాది మే 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆటో డెబిట్ సిస్టమ్ (Auto Debit System)ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి ప్రీమియం అమౌంట్ కట్ అవుతుంది. అంటే జూన్ 1న సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బు ఆటోమెటిగ్గా కట్ అవుతుంది. ఈ డబ్బు బీమా ప్రీమియం కోసం డిపాజిట్ అవుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు లేదంటే పోస్టాఫీస్ కు వెళ్ళి ఈ స్కీం కోసం అప్లయ్ చేసుకోండి. ప్రతి ఏడాది జూన్ 1న ఆటో డెబిట్ మోడ్ ద్వారా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ప్రీమియం (Premium) మొత్తాన్ని కట్ చేస్తుంటారు. పాలసీ దారుడు మరణిస్తే..నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది. పాలసీదారుడుమరణించినట్లు ద్రువీకరణ పత్రం, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నామినీ ఐడి వంటి పేపర్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదం కారణంగా పాలసీదారు వికలాంగుడైయినట్లయితే..బీమా కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం ఆసుప్రతి బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది.