Prabhas : 'కల్కి' సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..!

'కల్కి 2898AD' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Prabhas : 'కల్కి' సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..!
New Update

Prabhas With His Sisters : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' (Kalki 2898) నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'భైరవ ఆంథెమ్' పేరుతో రిలీజైన ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఈ పాటను ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు.

ప్రసుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ షూట్ లో (Kalki Song Shoot) ప్రభాస్ తన చెల్లెళ్ళతో కలిసి చేసిన అల్లరి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ కి ఈ చెల్లెల్లు అంటే చాలా ఇష్టం. మీడియాకి దూరంగా ఉండే వీళ్ళు అప్పుడప్పుడు ప్రభాస్ తో కనిపిస్తూ ఉంటారు. తాజాగా కల్కి సాంగ్స్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు.

Also Read : రిలీజ్ కు ముందే ‘కల్కి’ సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్!

ఈ పాట పాడిన దిల్జీత్ దోసంజ్, ప్రభాస్ తో కూడా కలిసి ఈ ముగ్గురు చెల్లెల్లు ఫోటోలు దిగారు. సాంగ్ రిలీజయ్యాక ఇప్పుడు ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ప్రసీద తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ చెల్లెళ్ళతో కలిసి చేసిన వీడియోలు, దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

#prabhas #kalki-2898-ad-movie #prabhas-with-his-sisters
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe