Prabhas : రాజాసాబ్ నుంచి సూపర్ అప్డేట్.. రిలీజ్ అప్పుడే

ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ గురించి పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. 2024 డిసెంబర్ 20 న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Prabhas : రాజాసాబ్ నుంచి సూపర్ అప్డేట్.. రిలీజ్ అప్పుడే
New Update

Rajasaab Movie : రెబెల్ స్టార్(Rebel Star) ప్రభాస్ పాన్ ఇండియా(PAN India) చిత్రాలతో స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే విడుదలైన సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్(Prabhas).. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దుమ్ము లేపేశారు. ప్రస్తుతం రెబెల్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ది రాజాసాబ్.

మారుతి "రాజాసాబ్ "

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం "రాజాసాబ్"(Rajasaab). కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే సంక్రాంతి(Sankranti) కానుకగా ఈ మూవీ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పంచ కట్టుకొని మాస్ అవతార్ లో కనిపించారు ప్రభాస్. ఈ మధ్య కాలం ఫుల్ యాక్షన్ మోడ్ కనిపించిన ప్రభాస్.. ఈ సినిమాలో డిఫెరెంట్ లుక్ కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది.

Also Read: Sai Pallavi: చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి.. మాస్ డాన్స్

రాజాసాబ్ రిలీజ్ అప్పుడే

అయితే ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియా(Social Media) లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. 2024 లో వస్తుందని కొంత.. లేదు 2025 లో అంటూ టాక్ వినిపించింది. దీంతో సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాగశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' కూడా 2024 లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. షెడ్యూల్ ప్రకారం షూట్ కంప్లీట్ అవుతే ఒకే ఏడాదిలో ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిధిలు, మాళవిక మోహన్ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

#pan-india-movie #prabhas-rajasaab #rajasaab-release
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe