/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-28-1.jpg)
Prabhas : డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు ఓ సరికొత్త లుక్ మైంటైన్ చేస్తున్నాడు. మొన్న 'కల్కి' లో భారీ కండలు తిరిగిన దేహంతో లావుగా కనిపించిన డార్లింగ్.. ఇప్పుడు ఒక్కసారిగా సన్నబడిపోయాడు. తాజాగా ప్రభాస్ లుక్ బయటికొచ్చింది.
శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మత్తు వదలరా 2 సినిమా ట్రైలర్ ను ప్రభాస్ లాంచ్ చేసాడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా ప్రభాస్ వద్దకు వెళ్లారు. ప్రభాస్ మత్తు వదలరా 2 మూవీ టీమ్ తో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేసి టీమ్ ని అభినందించారు. ఈ క్రమంలో మత్తు వదలరా మూవీ టీమ్ తో ప్రభాస్ ఉన్న రెండు ఫొటోలను బయటకు రిలీజ్ చేశారు.
Thank you Rebel Star #Prabhas Garu for launching #MathuVadalara2 Trailer ❤️
Darlings, a super fun trailer launch video is on its way this evening. Stay tuned 💥💥
In cinemas on 13th September, 2024 ❤️🔥
A @RiteshRana sequel.#MV2 @Simhakoduri23… pic.twitter.com/6GgN63ZiMx
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2024
Also Read : ఎయిర్ పోర్ట్ లో ‘జైలర్’ నటుడు వినాయకన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే
ఈ ఫొటోల్లో చూస్తుంటే ప్రభాస్ కొంచెం సన్నబడ్డాడు అని అనిపిస్తుంది. ప్రెజెంట్ ఈ లుక్ గురించే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బహుశా ఈ లుక్ హను రాఘవపూడి సినిమా కోసమేమో అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ న్యూ లుక్ మాత్రం అదిరిపోయింది.