/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-24-10.jpg)
The RajaSaab Glimpse: ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజా సాబ్'నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హారర్, రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమానుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేయగా.. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపించాడు.
Starting off the way #Prabhas usually does 😉🔥https://t.co/6gGGEnDwXW#TheRajaSaabOnApril10th #TheRajaSaab pic.twitter.com/pmm0sNx2ay
— The RajaSaab (@rajasaabmovie) July 29, 2024
ఈ మేరకు 45 సెకన్లపాటు సాగే వీడియోలో ప్రభాస్ బుల్లెట్ బైక్ పై వచ్చి చేతిలో ప్లవర్ బొకెతో టర్నింగ్ ఇచ్చుకోవడం అద్భుతంగా చూపించారు. మెరును కలర్ షర్ట్, కళ్లకు అద్దాలు, చేతిలో బొకేతో బైక్ అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ లవ్లీగా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 10, 2025న ‘రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.