Kalki 2898AD : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ర్యాంపేజ్.. రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'..! 'కల్కి' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.555 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. By Anil Kumar 01 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Prabhas 'Kalki' Joins 500 Crore Club : ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును టచ్ చేసిన ఈ సినిమా తాజాగా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూవీ జస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ (ఎక్స్) వేదికగా పోస్టు చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.555 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ లోనూ అదే దూకుడు... మరోవైపు నార్త్ లో 'కల్కి' కి భారీ ఆదరణ దక్కుతోంది. అక్కడ ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు అందుకుంటుంది. కేవలం నాలుగు రోజుల్లోనే హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ రూ.100 కోట్లు దాటేసింది. నార్త్ లో తొలిరోజు రూ.22.5 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా.. రెండో రోజు రూ.23 కోట్లు, మూడో రోజు రూ.26 కోట్లు, నాలుగో రోజు రూ.39 కోట్లు వసూలు చేసింది. అలా హిందీ బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తం 110.5 కోట్లకు చేరుకుంది. 555 CRORES & counting…💥 The BIGGEST FORCES are dominating the GLOBAL BOX OFFICE, show no signs of slowing down ⚡️#Kalki2898AD #EpicBlockbusterKalki@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/yoIe3yiLRr — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 1, 2024 #prabhas #kalki-2998-ad #kalki-movie-collections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి