Kalki 2898AD : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ర్యాంపేజ్.. రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'..!
'కల్కి' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.555 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది.