/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T151027.586.jpg)
Prabhas Kalki 2898AD Craze In Overseas : టాలీవడ్ లో ప్రెజెంట్ ‘కల్కి’ ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా జూన్ 27 న పాన్ వరల్డ్ లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఓవర్సీస్‌లో ఈ సినిమా జూన్ 26నే విడుదల కానుంది. తాజాగా అక్కడ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఓవర్సీస్ లో 'కల్కి' క్రేజ్ మాములుగా లేదుగా...
కల్కి మూవీని విదేశాల్లో ఏకంగా 124 లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. అందులో ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే అక్కడ థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై (Vyjayanthi Movies) సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read :మోడీతో అకీరా.. ఎమోషనల్ అయిన రేణు దేశాయ్, పోస్ట్ వైరల్!
మరో మూడు రోజుల్లో ట్రైలర్...
జూన్ 10న కల్కి మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ అప్డేట్ ఇస్తూ ఇటీవల ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ కటౌట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో మరింత జోష్ వచ్చేసింది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.