Kalki 2898 AD : నైజాం కింగ్ ప్రభాస్.. అక్కడ 'RRR' రికార్డు బ్రేక్ చేసిన 'కల్కి'..!

ప్రభాస్‌ ‘కల్కి' సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఒక్క నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు 'RRR' (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్నరికార్డ్ బ్రేక్ చెల్లా చెదురు అయిపోయింది.

Kalki 2898 AD : నైజాం కింగ్ ప్రభాస్.. అక్కడ 'RRR' రికార్డు బ్రేక్ చేసిన 'కల్కి'..!
New Update

Prabhas 'Kalki 2898 AD' Movie Nizam Day 1 Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్స్ పరంగానూ గత సినిమాల రికార్డ్స్ ను బద్దలుకొడుతూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. అక్కడ 'RRR' పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.

Also Read : అదరగొట్టిన ‘కల్కి’ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

నైజాం కింగ్...

'కల్కి' కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు 'RRR' (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్నరికార్డ్ బ్రేక్ చెల్లా చెదురు అయిపోయింది. ఈ రికార్డ్ తో ప్రభాస్ నైజం కింగ్ అనిపించుకున్నాడు.కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే వీకెండ్ ముగిసే సమయానికి అవలీలగా 50 నుంచి 70 కోట్ల వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీకి టీమ్ తాజాగా వెల్లడించింది. దీంతో ప్రభాస్ గత సినిమాల ఓపెనింగ్స్ ను ‘కల్కి’ డే 1 కలెక్షన్స్ బీట్ చేయడం విశేషం.

#prabhas #kalki-2898-ad-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe