Kalki 2898AD : పీక్స్ కు చేరిన 'కల్కి' క్రేజ్.. తొలి రోజే రూ.200 కోట్లా?

ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Kalki 2898AD : పీక్స్ కు చేరిన 'కల్కి' క్రేజ్.. తొలి రోజే రూ.200 కోట్లా?
New Update

Prabhas Kalki 2898 AD Openings : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ బుకింగ్స్ చూస్తుంటే కల్కి ఓపెనింగ్స్ గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : ‘ఇండియన్’ మూవీని మూడు పార్ట్ లుగా తీయడానికి కారణం అదే : శంకర్

ఓవర్సీస్ లోనూ అదే క్రేజ్..

కల్కి ఫీవర్ మన ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇండియాలో ఇప్పటికే లక్ష 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ జరిగింది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అమెరికాలో 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల రికార్డులు కొట్టుకుపోవడం గ్యారంటీ.

200 కోట్లకు పైగా ఓపెనింగ్స్...

కాగా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో 'బాహుబలి 2', 'RRR' సినిమాలు మాత్రమే ఈ ఫిగర్ ను క్రాస్ చేసాయి. ఇప్పుడు కల్కి వాటిని కచ్చితంగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను సుమారు 700 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్  ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

#prabhas #kalki-2898-ad-movie #kalki-openings
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి