Film News: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..!

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కన్నప్ప సినిమాలో శివుడిపాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే, ప్రభాస్‌కు జోడిగా పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. అయితే, అనుష్క పాత్రపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Film News: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
New Update

Prabhas-Anushka: ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బిల్లా, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో ఈ జంట ప్రేక్షకులను  ఎంతగానో అలరించింది. బహుబలి 2  తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు.

publive-image

అయితే, ఫ్యాన్స్ మాత్రం వీరు పెళ్లి చేసుకుంటే బాగుండు.. మరోసారి కలిసి నటిస్తే బాగుండు అని తెగ ఫీల్ అవుతుంటారు.  అయితే, తాజాగా ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో స్టార్ హీరో శివుడిపాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.

Also Read: స్టార్ హీరోపై హీరోయిన్‌ పోటీ.. నమిత సంచలన వ్యాఖ్యలు..!

publive-image

మొదట్లో ప్రభాస్‌కు జోడిగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా, లేటెస్ట్ సమాచారం మేరకు పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. అయితే, అనుష్క పాత్రపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. మరోసారి ఈ జంట కలిసి నటిస్తున్నట్లు వార్త చక్కర్లు కొట్టడంతో కన్నప్ప సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

publive-image

#anushka #prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి