/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-81.jpg)
Prabahs Kalki 2898AD Joins 700 Crore Club : బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. జూన్ 27 న రిలీజైన ఈ మూవీ రెండో వారంలోనూ రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొడుతుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇప్పుడు వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగా 'కల్కి' ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇదే విషయాన్నిమూవీ యూనిట్ వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్‌ను హైలైట్ చేయడం విశేషం. కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్లు కొల్లగొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
𝐓𝐡𝐞 𝐝𝐫𝐞𝐚𝐦 𝐫𝐮𝐧 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐞𝐬...
Witness the magic of #Kalki2898AD, now in theaters.#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/7UGJHXcbJM
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 3, 2024
Also Read : ‘అసిస్టెంట్’ నుంచి ‘ఆస్కార్’ వరకు.. కీరవాణి సంగీత ప్రస్థానం ఇదే!
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.