Power Cut : హైదరాబాద్(Hyderabad) లోని ఉప్పల్ స్టేడియానికి(Uppal Stadium) అధికారులు విద్యుత్ సరఫరా(Power Supply) ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ - చెన్నై మధ్య మ్యాచ్ ఉండగా.. ఇలాంటి పరిణామం చోటుచేకోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల నుంచి పెండింగ్‌లో ఉప్పల్ స్టేడియానికి చెందిన విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. దీంతో స్డేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది.
Also read: ఏఐ సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు
పెండింగ్ బిల్లుల(Pending Bills) క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా HCA పట్టించుకోలేదని.. నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 2015లో కూడా నిర్వాకులపై కేసు నమోదైందని.. 15 రోజుల క్రితం కూడా నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్.ఈ రాముడు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్‌తో విద్యుత్ సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు.