KCR Press Meet : గులాబీ బాస్ మాట్లాడుతుంటే పవర్ కట్.. కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కేసీఆర్.!

రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్సీలు సమావేశాల్లోనూ పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ లోనూ పవర్ కట్ అయ్యింది. గులాబీ బాస్ మాట్లాడుతుంటే కరెంట్ పోయింది. ఇలా కరెంటు పోతూ వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు.

New Update
KCR Press Meet : గులాబీ బాస్  మాట్లాడుతుంటే పవర్ కట్.. కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కేసీఆర్.!

KCR - Congress :  కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar) అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తూనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మీటింగ్ లలోనూ కరెంట్ పోవడం చూస్తూనే ఉన్నాం తాజాగా బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్(Press Meet) లోనూ ఇదే జరిగింది. గులాబీ బాస్ మాట్లాడుతుండగా సడెన్ గా కరెంట్ పోయింది.

నల్లగొండ, సూర్యపేట జిల్లాలో ఆదివారం కేసీఆర్(KCR) పర్యటించిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిపోతున్న వరిపొలాలను పరిశీలించారు. అనంతరం సూర్యపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో గులాబీ అధినేత పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ మాట్లాడటం ప్రారంభించారో లేదో.. కరెంటు పోయింది(Power Cut). ఆ తర్వాత కొద్దిసేపటి వచ్చింది. ఇట్ల పోతుంది...అట్ల వస్తుంది అంటూ కేసీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ అన్న మాటలు వినగానే అక్కడున్న వారంతా నవ్వారు. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామంటూ కేసీఆర్ అన్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొసాగించారు కేసీఆర్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు