Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. నిరుద్యోగులకు చల్లటి వార్తను చెవిలో వేసింది ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1,899 ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టులను బట్టీ పది, పన్నెండు తరగతులతో పాటూ డిగ్రీ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాదు క్రీడల్లో అర్హత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.
Also Read:షమీ నిన్ను పెళ్ళి చేసుకుంటా..కానీ ఒక్క షరతు అంటూ నటి పాయల్ ఘోష్ ప్రపోజల్
పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు,
సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు,
పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు,
మెయిల్ గార్డ్ 3 పోస్టులు,
ఎంటీఎస్ 570 పోస్టులు...మొత్తం 1, 899 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది ప్రభుత్వం. ఆన్ లైన్లో లేదా పోస్టల్ ద్వారా కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చును.
మరోవైపు టీఆర్‌టీ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సర్కారు వచ్చిన తర్వాతే విద్యాశాఖ పరీక్ష తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. మొదట నవంబర్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పింది. దీని ద్వారా మొత్తం 5,089 ఖాళీల భర్తీ చెయ్యనున్నారు.
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ విభాగం ఇచ్చే స్కాలర్ షిప్పుల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇందులో భాగంగా 2000 రూ. స్కాలర్ షిప్ అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
Also Read:2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..