Postal Ballet Process : ఎన్నికల(Elections) విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రంలో అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ ఓటును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైయ్యాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఈ నెల 5 న ప్రారంభమై 9న ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఉద్యోగులు(Employees) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజైన 9 వ తేదీన న పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374 ఓట్లు, అసెంబ్లీ నియోజక వర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అత్యధిక మొత్తంలో 22,650 పోస్టల్ బ్యాలెట్ నెల్లూరు నియోజక వర్గంలో పోల్ అవ్వగా, అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం నియోజక వర్గంలో పోల్ అయ్యాయి.
Also read: భర్తతో విభేదాల కారణంగా మూడేళ్ల కుమారుడ్ని కాల్చి చంపిన తల్లి!