OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీగా విడుదలకానుంది.

New Update
OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Family Star OTT Release: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా ఖుషి  సినిమాతో పలకరించారు. సమంత (Samantha Ruth Prabhu) హీరోయిన్‌‌గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీస్ నిర్మించింది. మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2023  సెప్టెంబర్ 1న భారీగా విడుదలై ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఖుషి తర్వాత విజయ్ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ (Family star) అనే ఓ సినిమా చేశారు. మృణాల్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు గోపీ సుందర్  సంగీతం అందించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ ఏప్రిల్ 5న భారీగా విడుదలై ఓకే అనిపించుకుంది.

ఉగాది కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ ని సాధించలేదు. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో ఓ అప్ డేట్ వచ్చింది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఈ మే 3 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఇక ఫ్యామిలీ స్టార్‌లో మృణాల్‌తో దివ్యాంశ కౌశిక్ కూడా ఒక కీలక పాత్ర నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ తన పన్నెండో సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్  ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వరుసగా సినిమాలు పోవడంతో ఈ సినిమాపై విజయ్ మరింత ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాత తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ మూవీ చేస్తు్న్నారట. గతంలో ఈ కాంబినేషన్‌లో టాక్సీవాలా వచ్చి బంపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ లేటెస్ట్ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ‘పీరియడ్ యాక్షన్ డ్రామా’గా రానుందని టాక్.

Also Read: గర్ల్ ఫ్రెండ్ తో బూట్లు నాకించిన స్టార్ హీరో.. దుమ్మెత్తి పోస్తున్న నటులు!