Pooja Hegde Turns As Mother : టాలీవుడ్(Tollywood) బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) సినీ కెరీర్ ప్రస్తుతం చాల డౌన్ లో ఉంది. గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సౌత్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. దాంతో బాలీవుడ్(Bollywood) కి వెళ్లి పలు అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి.
ఇటీవలే సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించిన 'కిసీకా భాయ్ కిసీకా జాన్' మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అయినా కూడా బాలీవుడ్ లో పూజా హెగ్డేకి ఆఫర్స్ తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుకుతుంది.
Also Read : సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. 10 రోజులు థియేటర్స్ బంద్!
పెళ్లి కాకుండానే తల్లిగా
పూజా హెగ్డే పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందట. అయితే ఇది తన రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. మ్యాటర్ ఏంటంటే, పూజా హెగ్డే ప్రెగ్నెంట్ లేడీగా నటించేందుకు రెడీ అవుతుందట. ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ హీరోయిన్ కి తన సినిమాలో అఫర్ ఇచ్చారట. కాకపోతే సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర చేయాలని, అందుకు భారీ రెమ్యునరేషన్ సైతం అఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
అసలే ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉండి సినిమా అవకాశాలు రాకపోవడంతో తల్లి పాత్రలో నటించేందుకు పూజా హెగ్డే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే పూజా హెగ్డే సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్ లోనే తల్లిగా కనిపించనుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా(Social Media) అంతటా వైరల్ అవ్వడంతో.. ఇది విని ఆమె ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. మొన్నటిదాకా సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డే.. ఇప్పుడు సినిమాలో మదర్ రోల్ చేయడం ఏంటని? కామెంట్స్ చేస్తున్నారు.