Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

గతంలో టూరిజం మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు.

New Update
Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

Telangana: కేంద్ర నుంచి తెలంగాణకు ఒక్కరూపాయి నిధులు తీసుకురాలేని బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి కేంద్రమంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది..
ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన పొన్నం.. నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించినట్లు చెప్పారు.హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్‌రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. కేంద్రం నిధులు ఇవ్వలేదని మేం అంటుంటే.. బీజేపీ వాళ్లు మా దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. కిషన్‌రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో కిషన్‌రెడ్డి చెప్పాలి. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తాం. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయం నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Stanford University: యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు