Khammam News: ప్రజలను సీఎం కేసీఆర్ సంతలో గొర్రెల్లా భావిస్తున్నారని అన్నారు పాలేరు(Palair) కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). కానీ ప్రజలకు ఎవరిని నమ్మాలో.. ఎవరి పక్షాన ఉండాలో తెలుసునని అన్నారు. ఖమ్మం(Khammam) రూరల్ మండలంలోని గొల్లగూడెం, బారుగూడెం, ఆరెంపుల, చింతపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పొంగులేటి. ఈ సందర్భంగా.. ప్రజలకు అభివాదం చేస్తూ, ఓట్లు అభ్యర్థిస్తూ, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ ముందుకు సాగారు. సీపీఐ శ్రేణులు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పొంగులేటి ప్రసంగిస్తూ తనను ఓడించేందుకు కేసీఆర్ కందాల ఉపేందర్‌కు రూ.100కోట్లు పంపించారని ఆరోపించారు.
ప్రజల దగ్గర దోచుకున్నదాన్నే వారికి తిరిగి పంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమయ్యిందన్నారు. రూ. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్.. నామమాత్రపు సొమ్మును ప్రజలకు పంచుతున్నారని ఆరోపించారు. అవి ప్రజలవేనని వాటిని తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దీవించాలని కోరారు పొంగులేటి. శీనన్నగా తనను ఎంతగానో అభిమానిస్తున్నారో.. అంతకు మించిన ఆధారాభిమానాలు వారిపై తనకు ఉన్నాయని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, బండి జగదీష్, బైరు హరినాథ్ బాబు, కన్నెటి వెంకన్న, గరిక పాటి వెంకట్రావ్, శివా రెడ్డి, చింతమళ్ల పద్మ, ముత్యం చిన్న కృష్ణారావు, మాదాల తిరుపయ్య, సత్తి ఉప్పలయ్య, మారుతి వెంకన్న, ధనియాకుల మహేష్, మల్లిఖార్జున్, మారుతి ఉపేందర్, భట్టా బాబు, చింతమళ్ల రవి, బండి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
వారిని ఖచ్చితంగా జైల్లో వేస్తాం.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..
కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?