Ponguleti: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్!

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌.. APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకోసం ఆయన ఫేక్ గ్యారెంటీలు సమర్పించారన్న విషయాన్ని RTV ఆధారాలతో సహా బయటపెట్టింది.

New Update
Ponguleti: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఫేక్‌ గ్యారెంటీల కుంభకోణం సంచలనంగా మారింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా కాంట్రక్టర్ల డొంక కదులుతోంది. దీంతో పొంగులోటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొంగులేటి వేల కోట్లల్లో మోసం చేశారని RTV బయటపెట్టిన కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి . APSPDCLతో పాటు APEPDCLతోనూ పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఒప్పందం చేసుకుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, అలాగే APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. మొత్తంగా వీటి విలువ రూ.4,500 కోట్లు.

Also Read:  భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్‌పై విచారణ.. త్వరలోనే బ్యాన్ !

ఇప్పటికే ఈ రెండు సంస్థల నుంచి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.217 కోట్లు అడ్వాన్సు కూడా తీసుకుంది. APSPDCL నుంచి రూ.115 కోట్లు, అలాగే APEPDCL నుంచి రూ.102 కోట్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం కాంట్రాక్టుకు పొంగులేటి ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీ గడువు ముగిసిందని APSPDCL.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు లేఖ కూడా రాసింది. దేశంతో సంబంధం లేని బ్యాంకు ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. కేవలం రూ.8 కోట్ల విలువైన యూరో ఎగ్జిమ్ బ్యాంకు.. రూ.వేల కోట్ల గ్యారెంటీలు ఇవ్వడం వెనుక వేల కోట్ల స్కామ్‌ జరిగింది.

మేఘా లాంటి బడా కాంట్రక్టు సైతం ఈ కుంభకోణంలో భాగమే. దొంగ బ్యాంకు గ్యారెంటీలతో వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలు నొక్కేస్తున్నాయి. ఈ మొత్తం కుంభకోణంలో SBI, UBI బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే ఈ దొంగ బ్యాంకు గ్యారెంటీల వ్యవహారాన్ని పరిశీలించాలని సీబీఐకి RBI లేఖ రాసిన సంగతి తెలిసిందే. యూరో ఎగ్జిమ్ బ్యాంకు వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐలకు లేఖ రాశారు.

Also Read: హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న సీఎం రేవంత్.. ఇది సాధ్యమేనా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు