Ponguleti Srinivas: ప్రతిపక్షాల కాకి గోలను తల తన్నేలా పని చేస్తాం.. పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ప్రతిపక్షాల కాకి గోలను తల తన్నేలా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. తమది పేదోడి ప్రభుత్వమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు!

Khammam: తెలంగాణలో ప్రతిపక్షాల కాకి గోలను తల తన్నేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ సమక్షంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలు తనకు ఆనందంతో పాలాభిషేకం చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. గత ప్రభుత్వం లాగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి తమ ప్రభుత్వం కాలం గడపదన్నారు.

పేదోడి గౌరవాన్ని కాపాడుకుంటూ..
తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయం. నిబద్ధత గల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వం. పేదోడి కోసం పని చేసే ప్రభుత్వమని మనస్ఫూ్ర్తిగా చెబుతున్నా. ఆ ప్రభుత్వ ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెబుతున్నా. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి పోయింది. ఆ కాలేశ్వరం ప్రాజెక్టు నేడు కుంగిపోయింది. కొట్టుకపోయింది. మీకు ఇచ్చిన హామీని నెరవేర్చటం కోసం ఒకపక్క ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుంది. మరోపక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ రెండిటిని సమతుల్యం చేస్తూ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తుందని అన్నారు.

అలాగే చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు