Pollution: పెను ప్రమాదంలో హైదరాబాద్.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో షాకింగ్ నిజాలు!

భాగ్యనగరం పెను ప్రమాదంలో పడబోతుంది. వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నాయని, WHO నిర్దేశించిన ప్రమాణాల కంటే వాయు కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోందని తెలిపింది.

New Update
Pollution: పెను ప్రమాదంలో హైదరాబాద్.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో షాకింగ్ నిజాలు!

Hyderabad Air Issue: దేశంలోనే నెంబర్ 1గా నిలవాలనుకుంటున్న హైదరాబాద్ పెను ప్రమాదంలో పడుతోంది. మహా నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. సౌత్ ఇండియాలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత కాలుష్య నగరంగా అవతరించబోతున్నట్లు గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి మెట్రో నగరాల్లో పొల్యూషన్ స్థాయిలను తెలుసుకునేందుకు చేపట్టిన గ్రీన్‌పీస్ ఇండియా ఒక సర్వేలో ఇతర నగరాల కంటే హైదరాబాద్ లో వాయుకాలుష్యం అధికంగా ఉన్నట్లు బయటపడింది.

14 రెట్లు ఎక్కువగా..
ఈ మేరకు బెంగళూరు, కొచ్చి, చెన్నైలతో పోల్చితే హైదరాబాద్‌లో 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నట్లు సర్వేలో స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే వాయు కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోందని తెలిపారు. అయితే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బంజారాహిల్స్, కేపీహెచ్‌బీలు ముందున్నాయి. కేపీహెచ్‌బీలో 124, జూపార్క్‌లో 144, బంజారాహిల్స్‌లో 127, సైదాబాద్‌లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి :AP: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!

ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్ చేరు, పాశమైలారం ప్రాంతాల్లో అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు. మహానగరంలో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా, హైదరాబాద్ వరుస ప్లేసుల్లో నిలిచాయి.

Advertisment
తాజా కథనాలు