కుప్పంలో చంద్రబాబు స్పీచ్-LIVE
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఈ రోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఈ రోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
లోక్సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీం, జై తెలంగాణతోపాటు జై పాలస్తీనా నినాదం చేయడంపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.
ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు.
అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడుతామని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆ మాట తప్పారని బీసీ జనసభనేత రాజారామ్ విమర్శించారు. పదేళ్లుగా దేశంలో కులగణన అనేదే లేకుండా పోయిందన్నారు. బీసీ కులగణనపై తొలివెలుగుకు ఆయన ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
బాపట్ల జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్నయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తగా నిర్మించిన రామ్ పథ్ రోడ్డు కుంగిపోయింది. ఈ వర్షాలకు అయోధ్య రామమందిర గర్భగుడి పైకప్పు లీక్ అవుతున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు.
సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు పొందారని స్థానిక ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ రావు ఆరోపిస్తున్నారు. ఆ లీజును రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులను కలిశారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు.