CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు
AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
AP: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు.
AP: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ పథకం ద్వారా రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా టీడీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో దక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. ఇది పిరికిపందల దాడి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజాస్వామ్యం నిరంతరం ఉల్లంఘించబడుతోందంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియపై అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ పనులు మరో రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు.
రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అరుదైన, ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవాలని సూచించారు.
కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిపై ఓ సామజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా స్కామ్లో సిద్ధరామయ్య, పార్వతితో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా.
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఉచిత ఇసుక అంటూ ధరలను వసూలు చేస్తున్నారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తుంటే.. వైసీపీ హయాంలో కంటే తక్కువేగా అంటూ టీడీపీ క్యాడర్ కౌంటర్ ఇస్తోంది.