KCR: సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు.
బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. ఐసోలేటెడ్ ఇంటెన్సివ్‌కేర్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీకి ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ అడ్వయిజర్‌గా ఉన్నారు అమిత్ మిత్రా.
కువైట్ బాధితుడు శివకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఎన్ఆర్ఐ లకు సమాచారం అందించి శివను సొంత గ్రామానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్నివిధాలా ఆదుకుంటామని శివ కుటుంబానికి లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వైసీపీ నేత విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశాడు. విజయసాయిరెడ్డి పిల్లలు కావాలని అడిగితే బాబును కనిపెట్టానని స్వయంగా శాంతి తనతో చెప్పినట్లు పలు ప్రూఫ్స్ బయటపెట్టాడు. డీఎన్ఏ టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరాడు.
TG: కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే, ఎంపీ గుడ్ బై చెప్పనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలిచ్చిన గొప్ప విజయాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. అధికారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించేవారి పై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.