గద్దర్ కు పాటల నివాళి-LIVE
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో గద్దర్ మొదటి వర్దంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో గద్దర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో గద్దర్ మొదటి వర్దంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో గద్దర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఈరోజు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఎల్కే అద్వానీ. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి నేడు. తెలంగాణ ఉద్యమానికే జీవితం అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్, ప్రముఖులు ఆయన కృషి, త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించారు.
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మరో ఎనిమిది మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. భూమికి ఉద్యోగం స్కామ్‌లో భాగంగా ఈడీ ఛార్జిషీట్ లో వారి పేరు నమోదు చేసింది. దీనిపై ఆగస్టు 13న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.
AP: తనకు రక్షణ కావాలని జగన్ అడుగుతున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాస్తవానికి జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చే సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకు ఇవ్వరని.. జగన్ ఇది తెలుసుకోవాలని అన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని ఈ రోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కోరారు. విమానయాన రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.
AP: వైసీపీ ఎమ్మెల్సీ భారత్‌పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు.
రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు.